తాంసి మండలంలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ రత్న ప్రకాష్ దాఖలు
మన భారత్, తాంసి: మండల కేంద్రంలో సర్పంచ్, వార్డ్ సభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ రిటర్నింగ్ అధికారులు అధికారికంగా ప్రారంభించారు. ఆదివారం తాంసి(బి) గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి నాయకుడు కృష్ణ రత్న ప్రకాష్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నామినేషన్ దాఖలు అనంతరం మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ మాట్లాడుతూ..
“తాంసి గ్రామ అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం. గతంలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగేందుకు, మరిన్ని సేవలు అందించేందుకు మరోసారి సర్పంచ్‌గా గెలిపించాలని, గ్రామ ప్రజలు ఆశీర్వదించాలి” అని వారు కోరారు.
నామినేషన్ సందర్భంగా ఆయనతో పాటు గ్రామ పెద్దలు, యువత, అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఎన్నికల సందడి తాంసి మండలంలో వేడెక్కుతోంది. తాంసి(బి)-4, హస్నాపూర్ -1, జామిడి- 1. మొదటిరోజు మండలంలో మొత్తం 6 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు.