చేసిన పనులు చెప్పుకోలేని రేవంత్ సర్కార్.?
రెండేళ్ల పాలన – చేసిన పనులు చెప్పుకోలేని రేవంత్ సర్కార్? వ్యూహాత్మక లోపాలే కాంగ్రెస్‌కు మైనస్! మన భారత్ , రాజకీయ డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజయాలను ప్రదర్శించేందుకు భారీ స్థాయి సభలకు సిద్ధమవుతోంది. కానీ పాలనలో చేపట్టిన కీలక నిర్ణయాలు, అమలు చేసిన పథకాలు ప్రజల్లో చర్చగా మారినా… ప్రచారంలో మాత్రం కాంగ్రెస్ సర్కార్ వెనుకబడి పోతుందన్న విమర్శలు వ్యాపిస్తున్నాయి. చేసిన...