manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 2:01 am Editor : manabharath

దేశంలోనే అతిపెద్ద మెగా సిటీగా హైదరాబాద్…

దేశంలోనే అతిపెద్ద మెగా సిటీగా హైదరాబాద్… GHMC విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు

మన భారత్ , హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద మెట్రో నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం భారీ అడుగులు వేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌ మహానగరాన్ని మరింత విస్తరించేందుకు GHMCలో 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే హైదరాబాద్‌ విస్తీర్ణం కొత్త రికార్డు సృష్టించనుంది.

ORR అవతలి ప్రాంతాలూ గ్రేటర్‌లోకి

అటు ORR వరకు, ఇటు దాని అవతల ఉన్న కీలక పరిసర ప్రాంతాలను కూడా గ్రేటర్ పరిధిలోకి తీసుకునే ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, రవాణా సౌకర్యాల పెంపు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు చేపడుతోంది.

కొత్త డివిజన్లు–కొత్త కార్పొరేషన్లు

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు విలీనానికి అనుసంధానంగా

* కొత్త డివిజన్ల రూపకల్పన,

* కార్పొరేషన్ల విభజన,

* పరిపాలనా పునర్వ్యవస్థీకరణ

  ఇవన్నీ వచ్చే 1–2 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

 

2,735 చదరపు కి.మీతో భారతదేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్

 

ఈ విలీనాలు పూర్తి అయితే హైదరాబాద్ విస్తీర్ణం 2,735 చదరపు కిలోమీటర్లకు పెరిగి, దేశంలోనే అతిపెద్ద మెగా సిటీగా అవతరించనుంది. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలకు ఇది మరింత ఊతం అందించనుంది.

అభివృద్ధి దిశగా వేగంగా పరుగులు తీస్తున్న హైదరాబాద్, రాబోయే కాలంలో కొత్త అర్బన్ మోడల్‌కు నిలయంగా మారనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.