manabharath.com
Newspaper Banner
Date of Publish : 28 November 2025, 8:13 pm Editor : manabharath

కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం..

కార్మికుడి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం..

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలం సావర్గాం గ్రామంలో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గజకంటి ప్రభాకర్ కుటుంబానికి ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ నుంచి ఆర్థిక సాయం అందించారు. ఏప్రిల్ 28, 2025న కరెంట్ పోల్ నుండి కిందపడి ప్రమాదవశాత్తు మరణించిన ప్రభాకర్, ప్రతీ సంవత్సరం రూ.1,000తో ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రమాద భీమా పథకానికి సభ్యుడిగా ఉన్నారు.

ఈ పథకం కింద భార్య నామినీ అయిన గజకంటి కృష్ణవేణి అకౌంట్‌కు రూ.20 లక్షల పరిహారం బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా  రీజినల్ మేనేజర్ జి. రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.

కుటుంబానికి భీమా మొత్తాన్ని అధికారికంగా అందజేస్తూ, బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని బ్యాంకు అధికారులు భరోసా ఇచ్చారు. గ్రామస్థులు, స్థానిక నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ కె. సురేష్, ఏరియా మేనేజర్ బాల జోహార్,తాంసి ఎస్‌బీఐ మేనేజర్ డి. శైలేష్, తాంసి ఎస్ఐ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.