💥తుపాను ‘దిత్వాహ్’ బంగాళాఖాతంలో వేగం పెంచింది
తమిళనాడు–పుదుచ్చేరి తీరాలకు ఆదివారం అతి చేరువ
మన భారత్, స్టేట్ డెస్క్ :నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం శనివారం తుపానుగా మారింది. ఈ తుపానుకు ‘దిత్వాహ్’ అనే పేరు యెమన్ దేశం పెట్టిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను ఉత్తర తమిళనాడు–పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా వైపు గంటకు సగటున 15 కి.మీ వేగంతో కదులుతోంది.
అధికారుల సమాచారం ప్రకారం, దిత్వాహ్ తుపాను
* ట్రింకోమలీ (శ్రీలంక)**కు – 200 కి.మీ
* పుదుచ్చేరికి – 610 కి.మీ
*చెన్నై ఆగ్నేయానికి – 700 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తాజా అంచనాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకు తుపాను చేరే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని అధికార యంత్రాంగం సూచించింది.