నామినేషన్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు..
ఇంద్రవెల్లి మండలంలో నామినేషన్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మన భారత్, తెలంగాణ: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద పోలీసులు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కేంద్రం చుట్టూ పోలీస్ సిబ్బందిని అదనంగా మోహరించడంతోపాటు, వాహనాల తనిఖీలు, ర్యాలీలపై పర్యవేక్షణ, గుంపులుగా చేరడాన్ని నిరోధించే...