బ్రేకింగ్ న్యూస్: పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్
బీసీలకు కేటాయింపు 17% దాటలేదని పిటిషనర్ వాదన
మన భారత్, తెలంగాణ: తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య దాఖలు చేసిన పిటిషన్‌లో బీసీ రిజర్వేషన్లు 17 శాతాన్ని మించకపోవడం జీవో 46 కు వ్యతిరేకమని ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పిటిషన్ చర్చనీయాంశమైంది.
పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన వివరాల్లో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉండగా, అందులో కేవలం 117 స్థానాలను మాత్రమే బీసీ వర్గాలకు కేటాయించారని వెల్లడించారు. ఈ కేటాయింపులు అసంవిధానికమని, జీవో 46 నిబంధనలు సరిగ్గా అమలు కాలేదని ఆయన వాదించారు.
పిటిషనర్ వినిపించిన వాదనలు పరిశీలించిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో తెలంగాణ పంచాయతీ రాజ్ ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది.