manabharath.com
Newspaper Banner
Date of Publish : 26 November 2025, 1:08 pm Editor : manabharath

భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు

మద్యం మత్తులో భార్యపై దాడి… భర్త రిమాండ్‌కు తరలింపు

మన భారత్, తాంసి: మండలంలోని కప్పర్ల గ్రామంలో గృహహింస ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు.

సీఐ వివరాల మేరకు.. కప్పర్ల గ్రామానికి చెందిన మల్లెల నరేష్ మద్యానికి బానిసై తరచూ భార్య లావణ్యతో గొడవపడి వేధింపులకు గురి చేసేవాడు. ఈ నెల 23న పరిస్థితి మరింత విషమించి, మద్యం మత్తులో నరేష్ ఇనుప పట్టితో తన భార్యపై దాడి చేశాడు. దీంతో లావణ్య తీవ్రగాయాలతో వేదన అనుభవించాల్సి వచ్చింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, బుధవారం నరేష్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆయనను రిమాండ్‌కు తరలించేందుకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ చర్యల్లో సీఐ ఫణిదర్‌తో పాటు ఎస్సై జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.