manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 4:45 pm Editor : manabharath

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా? రాజాసింగ్ ఆగ్రహం

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌ ఎస్సై అయ్యప్ప మాల ధరించినందుకు ఉన్నతాధికారులు మెమో జారీ చేసిన ఘటనపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో అమలు చేస్తున్న నిబంధనలు హిందూ అధికారులపైనే కఠినంగా అమలవుతున్నాయా? మిగతా మతాల వారికి అదే విధంగా వర్తించడం లేదా? అని ప్రశ్నించారు.

రాజాసింగ్ మాట్లాడుతూ, “ముస్లిం సోదరులకు రంజాన్ సమయంలో ప్రత్యేక స్వేచ్ఛలు ఇస్తారు. కానీ హిందూ పోలీస్ అధికారి అయ్యప్ప మాల వేసుకున్నందుకు ఎందుకు అభ్యంతరం? ఇదెక్కడి న్యాయం?” అని నిలదీశారు. చట్టాలు, రూల్స్ అన్నీ అందరికీ ఒకేలా ఉండాలని, ఏ ఒక్క మతాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం తగదని ఆయన హెచ్చరించారు.

ఇలాంటి వివక్షతపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, మత స్వేచ్ఛను గౌరవించడం ప్రతి అధికార సంస్థ బాధ్యత అని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై హిందూ సంస్థలు కూడా స్పందించినట్లు సమాచారం.: