ధనోరాలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా – జోగు రామన్న ప్రత్యేక పూజలు
మన భారత్, తాంసి: భీంపూర్ మండలంలోని ధనోరా గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి వెల్లివిరిసింది. ప్రత్యేక అర్చనలు, హోమాలు, సంప్రదాయ కార్యక్రమాలతో దేవాలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆయన, “ఇలాంటి ఉత్సవాలు గ్రామాలకు ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తాయి. ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు చేకూరుతాయి” అని పేర్కొన్నారు. దేవస్థాన అభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సుధాకర్, మాజీ సర్పంచ్ శంకర్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి ఘనతతో జరిగిన ఈ ఉత్సవాలు ధనోరా గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.