manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 11:18 am Editor : manabharath

మూడు కొత్త జిల్లాలకు ఆమోదం..

ఏపీకి మూడు కొత్త జిల్లాలు – పరిపాలనా వికేంద్రీకరణపై వేగం పెంచిన ప్రభుత్వం

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సంస్కరణలకు నూతన ఉత్సాహం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు త్వరలో అధికారికంగా అవతరించనున్నాయి. దీతో రాష్ట్రంలో సేవలు మరింత వేగవంతం అవుతాయని, ప్రజలకు పరిపాలన చేరువవుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

అదనంగా అద్దంకి, పీలేరు, బనగానపల్లె, మడకశిర, నక్కపల్లి ప్రాంతాలను కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో స్థానిక అవసరాలకు అనుగుణంగా పరిపాలన మరింత సులభతరం కానుందని అధికారులు భావిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రజా సేవలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలు, మౌలిక వసతుల అభివృద్ధి మరింత పటిష్టం కానున్నాయని అంచనా.