manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 November 2025, 1:38 am Editor : manabharath

నేరాలకు తెగిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్

రౌడీషీటర్లు మళ్లీ నేరాలకు తెగిస్తే కఠిన చర్యలు: సీపీ సజ్జనార్ హెచ్చరిక

మన భారత్, హైదరాబాద్: నగర భద్రతను బలోపేతం చేయడంలో భాగంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ రాత్రివేళల్లో ఆకస్మిక పర్యటనలు నిర్వహిస్తున్నారు. పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్న తాను, పోలీసులు క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నారో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికే ఈ పరిశీలనలు చేస్తున్నానని సీపీ తెలిపారు. ఇవి సిబ్బందిలో బాధ్యతాభావాన్ని పెంచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దోహదం చేస్తాయని అన్నారు.

రాత్రి 12 నుంచి 3 వరకు సౌత్ వెస్ట్ జోన్‌లో సజ్జనార్ పర్యటన

ఆదివారం అర్ధరాత్రి సజ్జనార్ లంగర్‌హౌస్, టోలిచౌకి పరిధిలోని కీలక రహదారులు, దొంగతనాలకు గురయ్యే పాయింట్లు, సున్నిత ప్రాంతాలను పర్యవేక్షించారు. ఎలాంటి సైరన్ లేకుండా సైలెంట్ వాహనంలో అకస్మాత్తుగా లంగర్‌హౌస్ పీఎస్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల ఇళ్లను నేరుగా సందర్శించారు

రౌడీషీటర్ల ఇళ్ల వద్దనే విచారణ

ఇళ్లలో నిద్రిస్తున్న రౌడీషీటర్లను నిద్రలేపి—

* వారి గత నేరాలు

* ప్రస్తుత జీవనశైలి

* ఉపాధి పరిస్థితులు

* సామాజిక వ్యవహార ధోరణులు

పైన సజ్జనార్ స్వయంగా ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగులు వేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తూ, సన్మార్గంలో ఉండాలంటూ వారిని హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే హోటళ్లు, షాపులపై చర్యలు

టోలిచౌకి పరిధిలో రాత్రి వేళల్లో తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర సంస్థలను కూడా పరిశీలించిన సీపీ

టెలంగాణ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే గట్టి చర్యలు తీసుకుంటామని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు.

పెట్రోలింగ్‌పై ప్రత్యక్ష పరిశీలన

* రాత్రి గస్తీ విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తత

* ప్రజల భద్రత కోసం చేపడుతున్న చర్యలు

* గస్తీ పాయింట్లలో ఉన్న సవాళ్లు

పైన సజ్జనార్ నేరుగా ప్రశ్నించారు. కానిస్టేబుళ్లు, అధికారులతో మాట్లాడి వారికి అవసరమైన మార్గదర్శకాలు ఇచ్చారు.

స్టేషన్ రికార్డుల పరిశీలన .. తరువాత టోలిచౌకి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ—జనరల్ డైరీ ,నిన్నటి ఎంట్రీలు డ్యూటీ హాజరు అప్పగించిన బాధ్యతలు అన్నీ సమగ్రంగా పరిశీలించారు.

“విజిబుల్ పోలీసింగ్ అత్యంత అవసరం”  సజ్జనార్

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ—నగరంలో నేరాలపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతోందని పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ప్రజా సమస్యలకు వెంటనే స్పందించాలి అని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌ను మరింత భద్రంగా మార్చేందుకు పోలీసింగ్‌ను కఠినతరం చేస్తున్నట్టు స్పష్టం చేశారు.