manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 8:18 pm Editor : manabharath

ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తోంది: మంత్రి జూపల్లి

ప్రభుత్వం నెలకు రూ.6,500 కోట్లు వడ్డీ చెల్లిస్తోంది: మంత్రి జూపల్లి

మన భారత్, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎంతటి ఒత్తిడిలో ఉన్నా సంక్షేమ పథకాలపై ఎలాంటి తగ్గింపులు లేవని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బోథ్‌లో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయ్యేంతవరకు భారీ అప్పుల భారంతో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేస్తూ, ప్రతి నెలా ప్రభుత్వం రూ.6,500 కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తూ ఉందని వెల్లడించారు.

అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గదని, సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని జూపల్లి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్ల పాటు అధికారం కొనసాగించే స్థిరమైన బలం కలిగి ఉందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.