బైంసా ఏఎస్పీ అవినాష్‌కు డా. అనిల్ కుమార్ జాదవ్ శుభాకాంక్షలు
సేవాభావానికి అభినందనలు, పుష్పగుచ్చం అందజేత
మన భారత్, ముధోల్ : ఇటీవల బైంసా డివిజన్ నుండి స్థాన చలనం పొందిన ఏఎస్పీ అవినాష్ కుమార్ ను ముధోల్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రజా సేవలను గుర్తిస్తూ పుష్పగుచ్చం అందించి సత్కరించారు.
బైంసా ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలతో సమన్వయం సాధించడంలో అవినాష్ కుమార్ అసాధారణ నిబద్ధత చూపారని డాక్టర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. మానవతా దృక్పథం, సేవాభావం కలిగిన అధికారులు ఉన్నప్పుడు సమాజం మరింత సుఖశాంతులతో ముందుకు సాగుతుందనే విషయానికి ఏఎస్పీ చేసిన కృషి నిదర్శనమని ఆయన అభినందించారు.
ఏఎస్పీ అవినాష్ కుమార్‌కు భవిష్యత్ సేవల్లోనూ విజయాలు కలగాలని ఆకాంక్షించారు.