manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 6:55 pm Editor : manabharath

“సీఎం రేసులో నేనూ ఉన్నా”: హోం మంత్రి

“సీఎం రేసులో నేనూ ఉన్నా” — కర్ణాటక రాజకీయాల్లో హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు

మన భారత్, కర్ణాటక: కర్ణాటకలో ఇటీవల నుంచి కొనసాగుతున్న సీఎం మార్పు చర్చలకు కొత్త మలుపు దొరికింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దళిత వర్గానికి ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వస్తున్న డిమాండ్ల నేపధ్యంలో “సీఎం రేసులో నేనూ ఉన్నాను” అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు.

సీఎం Siddaramaiah స్థానంలో కొత్త నాయకత్వంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ విషయంపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని పరమేశ్వర స్పష్టం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిగిన తరువాత, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అయితే ఇప్పటివరకు సీఎం మార్పు అంశంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్చ జరపలేదని ఆయన పేర్కొన్నారు. పరమేశ్వర వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలకు మరింత ఊపిరి పోశాయి. తదుపరి రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా మారతాయో అనే ఆసక్తి పెరిగింది.