manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 12:31 pm Editor : manabharath

ప్రభుత్వాలు చేయలేని సేవలను సత్యసాయి ట్రస్టే చేశింది: సీఎం రేవంత్

ప్రభుత్వాలు చేయలేని సేవలను సత్యసాయి ట్రస్టే చేశింది: సీఎం రేవంత్
పుట్టపర్తిలో సీఎం వ్యాఖ్యలు… సత్యసాయి ఆశయాలకు అభినందన

మన భారత్, తెలంగాణ: సత్యసాయి బాబా సేవా భావం, ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, ప్రభుత్వాలు కూడా సాధించలేని పలు సేవా కార్యక్రమాలను సత్యసాయి బాబా ట్రస్టు అమలు చేసిందని ప్రశంసించారు.

కేజీ నుంచి పీజీ వరకు పేదలకు పూర్తిగా ఉచిత విద్యను అందించడం, లక్షలాది మందికి వైద్య సహాయం అందించడం, ఎటువంటి రాజకీయాలు లేకుండా సేవను ధ్యేయంగా పెట్టుకుని పనిచేయడం ట్రస్టు గొప్పతనమని పేర్కొన్నారు. పాలమూరు వంటి వలస జిల్లాలకు శుద్ధ నీటి సదుపాయం అందించడం సత్యసాయి సంస్థల సేవా పంథాను తెలియజేస్తుందని సీఎం గుర్తు చేశారు.

సమాజానికి నిరంతరం సేవ చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించిన సత్యసాయి ట్రస్టు పనులను సమాజం ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.