manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 November 2025, 12:53 am Editor : manabharath

జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు ఘన సన్మానం..

జాతీయ పురస్కార గ్రహీత కలెక్టర్ రాజర్షి షాను
శాలువాలతో సన్మానించిన తాంసి మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ 

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాకు గర్వకారణంగా నిలిచిన కలెక్టర్ శ్రీ రాజర్షి షాకు మరో సత్కారం దక్కింది. జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సందర్భంగా తాంసీ మాజీ సర్పంచ్ స్వప్న రత్న ప్రకాష్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారి వర్గం, గ్రామస్తులు పాల్గొని కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అభివృద్ధి, ప్రజా సేవలో వినూత్న విధానాలతో జిల్లాను ముందుకు తీసుకెళ్లడంలో రాజర్షి షా చూపిన కృషి ప్రశంసనీయం అని తాంసి మాజీ సర్పంచ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన తీసుకున్న పారదర్శక చర్యలు, అమలు చేసిన అభివృద్ధి పథకాలు జిల్లాకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.

సన్మానాన్ని స్వీకరించిన కలెక్టర్ రాజర్షి షా, ఈ గుర్తింపు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కృషికి ప్రతిఫలం అని తెలిపారు. ప్రజల సహకారంతో మరింత మెరుగైన పరిపాలన అందించేందుకు కట్టుబడి ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు.