ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం..
అర్వపల్లి దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా ప్రారంభం మన భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని అర్వపల్లి హజ్రత్ ఖాజా నసీరుద్దిన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి.ప్రకృతి ఒడిలో, అర్వపల్లి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో పెద్ద పర్వతం పక్కన నెలకొన్న ఈ దర్గా హిందూ–ముస్లిం మతసామరస్యానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. దర్గా సమీపంలోని పాత రాజ భవనాల అవశేషాలు ఈ ప్రాంతం చారిత్రక ప్రాధాన్యాన్ని మరింత వెలుగులోనికి తెస్తాయి....