పంచాయతీ ఎన్నికల్లో కొత్త రొటేషన్: గ్రామాల రిజర్వేషన్లపై ఉత్కంఠ
మన భారత్, తెలంగాణ: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్ దక్కుతుందనే చర్చ మళ్లీ వేడెక్కింది.గతంలో అమలులో ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు రావచ్చని ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఈసారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయడం, అలాగే రొటేషన్ పద్ధతిలో కేటగిరీల మార్పు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
దీంతో ఇప్పటి వరకు ఒక కేటగిరీలో ఉన్న గ్రామాలకు ఈసారి మరో రిజర్వేషన్ కేటగిరీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారికంగా పూర్తి స్పష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేయనున్న జీవోపై అందరి దృష్టి నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 12,760 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రిజర్వేషన్ కేటాయింపులపై ప్రజలు, రాజకీయ నేతలు, అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.