manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 5:58 pm Editor : manabharath

అల్పపీడనం ప్రభావం.. ఆ జిల్లాలకు భారీ వర్షాలు

అల్పపీడనం ప్రభావం: ఆంధ్రలో పలుజిల్లాలకు భారీ వర్షాలు

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్: బంగాళాఖాతంలో రేపు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

అదేవిధంగా, రేపు మధ్యాహ్నానికి చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల దాకా వర్షాలు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

ఇప్పటికే నిన్న అర్ధరాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం విస్తృతంగా కురిసినట్లు సమాచారం. రాబోయే 24 గంటలు వాతావరణ పరంగా కీలకంగా మారనున్నాయని అధికారులు పేర్కొన్నారు.