manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 November 2025, 4:23 am Editor : manabharath

అయ్యప్ప ఆలయానికి నూతన కమిటీ ఎన్నిక..

సుంకిడి అయ్యప్ప ఆలయానికి నూతన కమిటీ: ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గం

మన భారత్, ఆదిలాబాద్: జిల్లాలోని తలమడుగు మండలం సుంకిడి అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం కొత్త కార్యవర్గం ఎన్నికలు నిర్వహించగా, సభ్యులు ఏకగ్రీవంగా కొత్త కమిటీని ఎన్నుకున్నారు. ఆలయ వ్యవస్థాపకులు, భూదాత ముస్కు ముకుంద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కొత్త బాధ్యుల పేర్లు ఖరారయ్యాయి.

అధ్యక్షుడిగా పిడుగు సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా సత్యం గౌడ్‌ను ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శి పదవికి తాంసి మాజీ సర్పంచ్ కృష్ణ రత్న ప్రకాష్ ను ఎంపిక చేయగా, సంయుక్త కార్యదర్శిగా కౌడల మహేందర్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారులుగా గడ్డం నవీన్, జంగ శ్రీకాంత్ రెడ్డిని నియమించారు.

సభ్యుల సూచనలతో పాటు ఆలయ అభివృద్ధి, వార్షిక కార్యక్రమాల ప్రణాళికపై సమావేశంలో చర్చ జరిగింది. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, దేవస్థాన పునరుద్ధరణ పనులకు కొత్త కమిటీ కట్టుబడి ఉందని సభ్యులు తెలిపారు.