డైరెక్షన్ పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
డైరెక్షన్ పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు – ‘నా సినిమా కూడా డీడీఎల్జీలా చిరస్థాయిగా నిలవాలి’ మన భారత్, హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో తన సొంత హాస్యశైలితో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అల్లరి నరేశ్, ఇప్పుడు డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. దర్శకుడిగా మారాలనే ఆలోచన చాలా కాలం నుంచే ఉందని, తాను తీసే సినిమా కూడా ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’లా ఎప్పటికీ నిలిచిపోయే కృతిగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు....