- రూ.50 లక్షలతో తీసి… రూ.60 కోట్ల దాకా దూసుకెళ్లిన లాలో
మన భారత్:, గుజరాతీ:తక్కువ బడ్జెట్-అత్యధిక కలెక్షన్ల ఫార్ములాను గుజరాతీ సినిమా ‘లాలో: కృష్ణ సదా సహాయతే’ మరోసారి నిరూపించింది. కేవలం రూ.50 లక్షలతో తెరకెక్కించిన ఈ చిన్న చిత్రం.. విడుదల మొదటి రోజుల్లో పెద్దగా రాణించకపోయినా, ప్రేక్షకుల ప్రశంసలతో మౌత్‌టాక్ పెరుగుతూ రూ.60 కోట్లు వరకూ వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.
రిక్షా డ్రైవర్ లాలో జీవితం, అతని పోరాటం, భావోద్వేగాలు, చిన్న మనసుల్లోని పెద్ద విశ్వాసం—ఇవి అన్నింటిని హృద్యంగా చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అంకిత్ సఖియా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరణ్ జోషి ప్రధాన పాత్రలో నటించాడు. గత నెల నవంబర్ 10న విడుదలైన ఈ సినిమా.. ఏకంగా జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతోంది.
తక్కువ బడ్జెట్ ఉన్నా.. కంటెంట్ బలంగా ఉంటే ప్రజలు సినిమాను చేతికి ఎత్తుకుంటారనేది ఈ విజయం మరోసారి నిరూపించింది.