manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 8:27 am Editor : manabharath

ఆశ్రమ హైస్కూల్‌లో ఫోలిక్ ఆమ్ల మాత్రల పంపిణీ

ఆశ్రమ హైస్కూల్‌లో ఫోలిక్ ఆమ్ల మాత్రల పంపిణీ

మన భారత్, తాంసి: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తాంసి ఆశ్రమ హైస్కూల్‌లో గురువారం ఫోలిక్ ఆమ్ల (Folic Acid) మాత్రలను పంపిణీ చేశారు. ప్రతి గురువారం మండలంలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లు, జూనియర్ కాలేజీల్లో ఈ మాత్రలు మింగించే కార్యక్రమం చేపట్టినట్లు తాంసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సూపర్వైజర్ రాథోడ్ తులసీరామ్ వెల్లడించారు.

 వైద్య సిబ్బంది పాల్గొని విద్యార్థులకు ఫోలిక్ ఆమ్ల మాత్రల ప్రాధాన్యం, ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తరచూ తీసుకునే ఆహారంలో లోపించే ఐరన్‌, ఇతర పోషకాల కొరతను తీర్చడంలో ఈ మాత్రలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.

ఆరోగ్య విభాగం సూచనల మేరకు రాబోయే వారాల్లో కూడా ఇదే విధంగా కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ నగేష్, ఏఎన్ఎం లక్ష్మి, ఆశ కార్యకర్తలు ప్రభావతి ,పద్మ, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.