manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 8:12 am Editor : manabharath

హలో రైతన్న.. భోరజ్ ధర్నా విజయవంతం చేద్దాం

హలో రైతన్న.. భోరజ్ ధర్నా విజయవంతం చేద్దాం

మన భారత్, తాంసి: తాంసి మండలంలో రైతుల సమస్యల పరిష్కారార్థం ఈ నెల 21న భోరజ్‌లో జరగబోయే ‘హలో రైతన్న చలో భోరజ్’ ధర్నాను ఘనవిజయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాష్ పిలుపునిచ్చారు. స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలు పంపిణీ చేసిన ఆయన, రైతుల కోసమే ఈ ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

  • సీసీఐ పత్తి కొనుగోళ్లు: తేమ శాతం సంబంధం లేకుండా పత్తి కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టే నియమాలన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
  • ‘కపాస్ కిసాన్ యాప్’, ఫింగర్ ప్రింట్ విధానం రద్దు: రైతులకు భారంగా మారిన ఈ ప్రక్రియలను వెంటనే నిలిపివేయాలని కోరారు.
  • సోయాబీన్ కొనుగోలు: రంగు మారిన సోయాబీన్‌కూ ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలని స్పష్టం చేశారు.
  • రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని స్పందింపజేయడానికి ఈ ధర్నా కీలకమని, అందరూ తప్పనిసరిగా పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. 
  • ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు నాయకులు ఉత్తం, అశోక్ తదితరులు పాల్గొన్నారు.