🌙 19-11-2025 – బుధవారం రాశిఫలాలు
మన భారత్ ,రాశీ పొలాలు:
🔯 మేషం (Aries)
వ్యాపార పెట్టుబడుల్లో పునరాలోచన అవసరం. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ముఖ్య వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నతాధికారులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. బంధువులతో దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది.
🔯 వృషభం (Taurus)
కుటుంబ సహకారంతో వ్యాపార విస్తరణ జరుగుతుంది. దూర బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగాల్లో ఆశించిన పదవులు లభిస్తాయి. విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు. పాత మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.
🔯 మిధునం (Gemini)
గృహంలో శుభకార్య సూచనలు కనిపిస్తాయి. చేపట్టిన పనులు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాలు మంచిగా ఉంటాయి.
🔯 కర్కాటకం (Cancer)
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశం. సోదరులతో స్థిరాస్తి విషయాల్లో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడి తప్పదు. ఆర్థిక పరిస్థితి కొంత క్లిష్టంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండాలి.
🔯 సింహం (Leo)
వ్యాపారాల్లో తాత్కాలిక ఇబ్బందులు. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితం ఇవ్వకపోవచ్చు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి. భక్తి-భావాలు పెరుగుతాయి.
🔯 కన్య (Virgo)
వ్యాపారాలు రాణిస్తాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాల్లో పదోన్నతులు. బాకీలు వసూలవుతాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది.
🔯 తుల (Libra)
ఆకస్మిక ప్రయాణాలు ముందున్నాయి. పాత మిత్రులతో స్వల్ప మాటపట్టింపులు. వ్యాపారాలు మోస్తరు. ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పుల సూచనలు. చేపట్టిన పనుల్లో ఆలస్యం. రుణయత్నాలు వేగవంతం చేస్తారు.
🔯 వృశ్చికం (Scorpio)
పాత మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో పేరున్న వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగాల్లో సమస్యలు తగ్గుతాయి. వాహన కొనుగోలు యోచనలు సిద్ధమవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం.
🔯 ధనస్సు (Sagittarius)
వ్యాపారాల్లో శ్రమ పెరుగుతుంది. పాత ఋణాలు తీర్చాల్సి వచ్చే అవకాశం. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కనిపిస్తాయి.
🔯 మకరం (Capricorn)
నిరుద్యోగులకు శుభవార్త. వ్యాపారాలు లాభసాటిగా. కొత్త వస్తువులు కొనుగోలు. ఉద్యోగాల్లో పురోగతి. కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము చేతికి వస్తుంది.
🔯 కుంభం (Aquarius)
పాత మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపార-ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు. నిరుద్యోగులకు అవకాశాలు. ప్రముఖులతో పరిచయాలు శుభం. ఆస్తి వివాదాలు పరిష్కారం.
🔯 మీనం (Pisces)
ఆధ్యాత్మికత పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిరుత్సాహకరం. అధికారులతో ఉద్యోగ విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణభారం పెరుగుతుంది. ఇంటి బయట గందరగోళ పరిస్థితులు.