manabharath.com
Newspaper Banner
Date of Publish : 20 November 2025, 2:51 am Editor : manabharath

పంచాయతీ ఎన్నికలు రంగంలోకి ఎస్ఈసీ ..

పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఈసీ రంగంలోకి .. ఓటర్ల జాబితా సవరణకు షెడ్యూలు విడుదల

మన భారత్, హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తెరలేవనున్న వేళ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అధికారులకు దశల వారీ సూచనలు జారీ చేసింది. గురువారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకు గ్రామాల వారీగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది.

ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాల మేరకు

🔸 20వ తేదీ: ఓటర్ల దరఖాస్తుల స్వీకరణ

🔸 21వ తేదీ: వచ్చిన అభ్యంతరాల పరిష్కారం

🔸 23వ తేదీ: గ్రామాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల

ఎస్ఈసీ వర్గాల ప్రకారం, డిసెంబరు రెండో వారంలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, నెలాఖరులోపు మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమవుతోంది. అధికారులు, సిబ్బంది, గ్రామస్థాయి ఏర్పాటు కమిటీలతో సమన్వయం సాధిస్తూ ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.