భారత్ కు ట్రంప్ కుమారుడు రాక… ఉదయ్‌పూర్‌లో భారీ భద్రత
మన భారత్, అంతర్జాతీయ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు , వ్యాపారవేత్త డొనాల్డ్ ట్రంప్ జూనియర్ భారత్ పర్యటనకు సిద్ధమైనట్లు సమాచారం. రాజస్థాన్‌లోని ప్రసిద్ధ పర్యాటక నగరం ఉదయ్‌పూర్ ఈ నెల 21, 22 తేదీల్లో ఇండో-అమెరికన్ జంట వివాహానికి ఆతిథ్యం ఇవ్వనుండగా, ఆ వేడుకలో భాగంగా ట్రంప్ జూనియర్ పాల్గొననున్నట్లు రాజస్థాన్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.
చరిత్రాత్మక జగ్ మందిర్ ప్యాలెస్‌లో జరగనున్న ఈ రాజసంగా జరిగే వివాహ వేడుకకు పలువురు అంతర్జాతీయ అతిథులు కూడా హాజరుకానున్నారని సమాచారం. ట్రంప్ జూనియర్ లీలా ప్యాలెస్‌లో బస చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయన రాక నేపథ్యంలో US సెక్యూరిటీ ఏజెన్సీ ప్రత్యేక బృందం ఇప్పటికే ఉదయ్‌పూర్‌కు చేరుకుని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది.
వైవిధ్యభరితమైన సంప్రదాయాలు, రాజస్థాన్ సొబగులు, రాజ ప్రసాదాలు సంబరాలు కలిసి ఈ వేడుకను అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేలా మార్చనున్నాయి. ప్రముఖ అతిథులు రావడంతో భద్రతను అత్యంత కట్టుదిట్టంగా మలిచినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి.