manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 8:51 am Editor : manabharath

నేడు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల.!

నేడు పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల!

మన భారత్, న్యూ డిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు నేడు 19వ తేదీ బుధవారం 21విడత నిధులు విడుదలl కానున్నాయి, మరికొన్ని గంటల్లో రైతుల ఖాతాల్లో నేరుగా రూ”2,000 చొప్పు న జమ కానున్నాయి…

వీటితోపాటు..అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత నిధులు రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఒకేరోజు రూ.7 వేల నగదు జమ కానుంది.అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు రూ.3,135 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి.

ఇందులో అన్నదాత సుఖీభవ పథకం రెండో విడతలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.2,342.92కోట్లు కాగా.. పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం వాటా రూ. 972.09 కోట్లు ఉంటుంది.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతీ యేటా మూడు విడతల్లో డబ్బులు జమ చేసేందుకు నిర్ణయించింది.

పిఎం కిసాన్ పథకంతో కలిపి మూడు విడతల్లో మొత్తం రూ.20 వేలు జమ చేస్తామని చెప్పింది. తొలి విడత రూ.7 వేలు, రెండో విడత రూ.7 వేలు, మూడో విడత రూ.6 వేలు ఇస్తా మని కూటమి ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడత డబ్బులు రైతులు బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. రెండు విడతల్లో కలిపి ఈ పథకం కింద మొత్తం రూ.6,309. 44 కోట్లు ప్రభుత్వం అందించినట్లు తెలుస్తుంది.