manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 8:34 am Editor : manabharath

లిక్కర్ స్కామ్ లో మరో సంచలనం..

లిక్కర్‌ స్కామ్‌లో మరో సంచలనం: చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు గ్రీన్‌ సిగ్నల్

మన భారత్, అమరావతి: లిక్కర్ స్కామ్ కేసులో కీలకమైన మలుపు తిరిగింది. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేయగా, విచారణలో ఇది ముఖ్యమైన దశగా భావిస్తున్నారు.

సిట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం .. తిరుపతి రూరల్ పరిధిలో చెవిరెడ్డి కుటుంబం భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసినట్టు విచారణలో బయటపడింది. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో రియల్‌ ఎస్టేట్ లావాదేవీలను జరిపారని నివేదికల ద్వారా సూచనలు లభించినట్లు వెల్లడించారు.

లిక్కర్ స్కామ్ కేసులో ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందే పలువురు నిందితుల ఆస్తులను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజా జప్తు అనుమతితో కేసు దిశ మరింత సీరియస్ దశలోకి చేరినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Liquor Scam, Chevireddy Bhaskar Reddy, Asset Seizure, Andhra Pradesh Government, SIT Investigation, Tirupati Rural, Political News,India News