manabharath.com
Newspaper Banner
Date of Publish : 19 November 2025, 8:23 am Editor : manabharath

కోట్ల మందిని నడిపించే శక్తి “సత్య సాయి బాబా”ది

“సత్యసాయి బోధనలు లక్షల మందికి దీపస్తంభం” – ప్రధాని మోదీ

మన భారత్, పుట్టపర్తి: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం తనకు భాగ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పుట్టపర్తిలో నిర్వహించిన మహోత్సవాల్లో పాల్గొన్న ఆయన, సత్యసాయి సందేశం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని నడిపించే శక్తి అని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మాట్లాడుతూ —
“విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి బాబా జీవించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా, ఆయన ప్రేమ, సేవా బోధనలు ఇప్పటికీ ప్రతి హృదయంలో ప్రతిధ్వనిస్తున్నాయి. దేశం నలుమూలలా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు మానవ సేవను తమ ధర్మంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. సత్యసాయి ప్రేమ సూత్రాలు అనేక మందిని ఆలోచింపజేశాయి. ఆయన బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయి” అని అభినందించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సత్యసాయి జీవితం, బోధనలు, సేవలకు గుర్తుగా రూపొందించిన ₹100 స్మారక నాణెం మరియు 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు. భక్తులు, సేవాభిలాషులు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో అంగరంగ వైభవంగా జరిగింది.

PM Modi, Sathya Sai Baba, Puttaparthi, Centenary Celebrations, Spiritual Teachings, India News, Commemorative Coin, Postal Stamps, Satya Sai Legacy