వారణాసి’ బడ్జెట్ ఝలక్… రూ.1500 కోట్లు దాటేసిందా?
మన భారత్, హైదరాబాద్: మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌పై భారీ అంచనాలతో తెరకెక్కుతున్న పాన్‌వరల్డ్ సినిమా **‘వారణాసి’** బడ్జెట్ రోజురోజుకూ పెరుగుతూ ఇండస్ట్రీలో సంచలనంగా మారుతోంది. మొదట రూ.1000 కోట్ల వద్ద ప్లాన్ చేసిన ఈ భారీ ప్రాజెక్టు, తాజా సమాచారం ప్రకారం రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అత్యాధునిక విజువల్ టెక్నాలజీ, ప్రపంచ స్థాయి భారీ సెట్లు, విదేశీ లొకేషన్లు, యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేక భారీ టీమ్‌లు – ఇవన్నీ బడ్జెట్ పెరగడానికి ప్రధాన కారణాలుగా ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. గ్లోబల్ ప్రమోషన్ కోసం మాత్రమే రూ.200 కోట్లు, ప్రముఖుల సమక్షంలో జరిగే ‘గ్లోబల్ డిటర్ ఈవెంట్’ కోసం రూ.30 కోట్లు ప్రత్యేకంగా కేటాయించినట్లు సమాచారం.
అదనంగా, పాన్‌వరల్డ్ ప్రాజెక్ట్ కావడంతో నటీనటులు, టెక్నికల్ టీమ్ రెమ్యునరేషన్లు కూడా భారీ స్థాయిలో ఉండటం, మొత్తం బడ్జెట్‌ను మరింత పెంచినట్లు తెలుస్తోంది. రాజమౌళి గత చిత్రాలు ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ల వలె ప్రపంచ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ సినిమా, భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ మూవీగా నిలిచే అవకాశముంది.
సినిమా లేటెస్ట్ అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.