manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 2:48 pm Editor : manabharath

రేపే రైతుల ఖాతాల్లోకి రూ.7,000 – సర్కార్ గుడ్‌న్యూస్

రేపే రైతుల ఖాతాల్లోకి రూ.7,000 – సర్కార్ గుడ్‌న్యూస్

మన భారత్, అమరావతి: రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా ప్రభుత్వం రేపు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.7,000 జమ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. కడప జిల్లా పెండ్లిమర్రిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం ఎన్‌. చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో ముఖాముఖి సమావేశం కూడా నిర్వహించనున్నారు.

అర్హత వివరాలు తెలుసుకోవాలనుకునే రైతులు ప్రభుత్వ అధికారిక పోర్టల్ annadathasukhibhava.ap.gov.in ను సందర్శించవచ్చు. వెబ్‌సైట్‌లోని ‘Know Your Status’ ఆప్షన్‌ను క్లిక్ చేసి Aadhaar/మొబైల్ నంబర్ నమోదు చేస్తే తాము సహాయం పొందే అర్హులా కాదా అనేది వెంటనే తెలుసుకోవచ్చు.

రైతుల ఆర్థిక భారం తగ్గించేందుకు, పంట పెట్టుబడులకు ఉపయోగపడే విధంగా ఈ నిధుల విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పథకం అమలుపై రైతుల్లో భారీ ఆశలు నెలకొన్నాయి.

#PMKisan #AnnadataSukhibhava #APGovernment #FarmerSupport #ManaBharath.Com