manabharath.com
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 12:19 pm Editor : manabharath

వాట్సాప్‌లో మీసేవ సేవలు ప్రారంభం..

వాట్సాప్‌లోనే మీసేవ సేవలు ప్రారంభం .. ఇంటి వద్దే 580 సేవలు

మన భారత్, హైదరాబాద్:  ప్రజలకు మరింత సులభంగా, వేగంగా ప్రభుత్వ సేవలు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మీసేవ సేవలను వాట్సాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త డిజిటల్ సేవలను ఐటీ & పౌరసేవల మంత్రి శ్రీధర్ బాబు అధికారికంగా ప్రారంభించారు.

ప్రస్తుతం మేసేవ కేంద్రాల్లో లభించే మొత్తం 580 సేవలను ఇకపై వాట్సాప్‌ ద్వారా పొందే అవకాశం కలుగనుంది. ప్రజలు ఇంటిలో నుంచే విద్యుత్ బిల్లు చెల్లింపు, ఆస్తి పన్ను చెల్లింపు వంటి ముఖ్య సేవలు చేసుకోవచ్చని అధికారు తెలిపారు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రం, జనన-మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర ముఖ్య ఆధార పత్రాలు కూడా వాట్సాప్ ద్వారానే పొందే సదుపాయం కల్పించనున్నారు.

ఈ కొత్త డిజిటల్ విధానం ద్వారా సమయం ఆదా కావడంతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రభుత్వ సేవలు మరింత చేరువవుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఆధారంగా పారదర్శక, సులభ సేవలందించడంలో ఇది కీలక మైలురాయిగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.