నితీష్ ప్రమాణ స్వీకార వేడుకకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఆహ్వానం
మన భారత్, పాట్నా, నవంబర్ 18: బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కానున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ & పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేష్‌కు అధికారిక ఆహ్వానం అందింది. నవంబర్ 20న పట్నాలో జరగనున్న ఈ వేడుకకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకులు హాజరు కానున్నారు.
ఇటీవల బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి దాదాపు ఏకపక్ష విజయం సాధించి 202 స్థానాలు దక్కించుకుంది. సభానేతగా నితీశ్ కుమార్ ను తిరిగి ఎన్నుకోవడంతో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నారు. ఈసారి ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్ సైతం NDA తరఫున బిహార్ పర్యటనలు చేసి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పట్నా ప్రయాణం ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్బంగా రెండు రాష్ట్రాల నాయకత్వాల మధ్య అభివృద్ధి, పరిపాలన, పెట్టుబడుల అంశాలపై చర్చలు జరిగే అవకాశముంది.