సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ₹5 లక్షల పరిహారం
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ₹5 లక్షల చొప్పున పరిహారం — మంత్రివర్గ నిర్ణయం మన భారత్, హైదరాబాద్: సౌదీ ఆరేబియాలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మృతుల...