manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 November 2025, 8:33 am Editor : manabharath

త్వరలో అంగన్వాడీల్లో 14 వేల పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క హామీ

త్వరలో అంగన్వాడీల్లో 14 వేల పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క హామీ
మన భారత్,ములుగు: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అంగన్వాడీ కారుణ్య నియామకాలకు సంబంధించిన ఫైలు చివరి దశలో ఉందని, త్వరలోనే 14 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.

ములుగులో అంగన్వాడీ ప్రీ-స్కూల్ చిన్నారులకు 100ml పాలు పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె— రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అంగన్వాడీ వర్కర్ల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా సంక్షేమం దృష్ట్యా ఉంటాయని స్పష్టం చేశారు.

రిటైరైన అంగన్వాడీ వర్కర్లకు పెండింగ్‌లో ఉన్న అన్ని నిధులను త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కొనసాగుతున్న సంస్కరణలను త్వరలో ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు.