“కాంగ్రెస్కు కాదు… నవీన్‌కే మా సపోర్టు” – అసదుద్దీన్ స్పష్టం
మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక ప్రకటన చేశారు. తాము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, వాస్తవానికి వ్యక్తిగతంగా నవీన్ యాదవ్‌కి మాత్రమే సపోర్టు చేశామని తెలిపారు. కొన్ని వర్గాలు తమ నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని ఆయన స్పష్టం చేశారు.
ఉపఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన ఒవైసీ, “నవీన్ మంచి పనులు చేస్తాడని భావించి మేము ఆయనకు మద్దతిచ్చాం. ఇది కాంగ్రెస్‌కు సపోర్టు చేసినట్టుగా భావించడం సరైంది కాదు” అని అన్నారు.
అదే సమయంలో, బీఆర్ఎస్‌తో ఎటువంటి విభేదాలు లేవని కూడా ఆయన స్పష్టం చేశారు. “కేసీఆర్‌గారు అయినా, నేను అయినా… మా మా పార్టీలకు మంచిదనిపించేదాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తాం” అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఉపఎన్నికల తరువాత ప్రాంతీయ పార్టీల రాజకీయ లెక్కలపై ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
#AsaduddinOwaisi #JubileeHillsBypoll #NaveenYadav #AIMIM #TelanganaPolitics #ManaBharath.Com