manabharath.com
Newspaper Banner
Date of Publish : 16 November 2025, 12:55 pm Editor : manabharath

కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. : KTR

ప్రభుత్వం విఫలం… పత్తి క్వింటాలకు ₹2వేల నష్టం: KTR మండిపాటు

మన భారత్, హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..“ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర ₹8,110గా నిర్ణయించబడింది. కానీ బహిరంగ మార్కెట్లో రైతులకు ₹6,000–₹7,000 మాత్రమే అందుతోంది. దీంతో ఒక్క క్వింటాల్‌పైనే రైతులు ₹2,000 వరకు నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమైంది” అని ఫైరయ్యారు.

అదే సమయంలో, తేమ శాతం ఎక్కువగా ఉందనే కారణంతో CCI పత్తిని కొనుగోలు చేయడంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలతో పత్తి కొనుగోళ్లు, మద్దతు ధర, CCI ధోరణిపై మరోసారి రాజకీయ చర్చ తెరపైకి వచ్చింది.

#KTR #CottonMSP #TelanganaPolitics #FarmersIssues #CottonProcurement #CCI #ManaBharath.com