యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం – యోగా మాస్టర్ రావుల సాయి కృష్ణ స్ఫూర్తిదాయక సందేశం
మన భారత్, ఆదిలాబాద్: శ్రమ లేకుండా ఆరోగ్యం రాదని, కానీ యోగాతో ఆరోగ్యాన్ని సులభంగా నిలబెట్టుకోవచ్చని ప్రముఖ యోగా మాస్టర్ రావుల సాయి కృష్ణ తెలిపారు. ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, ఊబకాయం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్న క్రమంలో యోగా ఒక్కటే శరీరం ,మనసు,ప్రాణానికి సమతుల్యతనిచ్చే సాధనగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
రోజూ 30 నిమిషాల యోగా చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత పెరుగుతుందని సాయి కృష్ణ వివరించారు. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, మొత్తం మూడు కలసి చేసినప్పుడు మాత్రమే నిజమైన ఫలితాలు వస్తాయని చెప్పారు.
యువత నుంచి వృద్ధుల వరకు అందరూ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. “ఒక మనిషి రోజూ యోగా చేస్తే, వైద్య ఖర్చులు 50 శాతం తగ్గే అవకాశం ఉంటుంది. నీరసమైన శరీరానికి ఉల్లాసం, ఆందోళనకు ప్రశాంతత, అల్లకల్లోలానికి క్రమశిక్షణ యోగానే ఇస్తుంది” అని సాయి కృష్ణ అన్నారు.
యోగాలోని కొన్ని ముఖ్య ప్రయోజనాలు:
- రోగనిరోధక శక్తి పెరుగుదల
- మెదడు ప్రశాంతత, ఏకాగ్రత మెరుగుదల
- హార్మోన్ స్థిరత్వం
- బీపీ, షుగర్ నియంత్రణ
- బరువు నియంత్రణ, లావు తగ్గింపు
- నిద్ర నాణ్యత మెరుగుదల
- శరీర సౌష్టవం, నొప్పులు తగ్గింపు
సాయి కృష్ణ పేర్కొన్న యోగా శిక్షణ శిబిరాలకు విద్యార్థులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతూ ఆరోగ్యం వైపు తమ అడుగులు వేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
Yoga-health-benefits-Raavula-Sai-Krishna-yoga-master