manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 2:24 am Editor : manabharath

క్షమాపణతో ముగిసిన వివాదం

కొండా సురేఖపై కేసు ఉపసంహరించిన నాగార్జున — బహిరంగ క్షమాపణతో ముగిసిన వివాదం

మన భారత్, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాను ప్రముఖ నటుడు ‘కింగ్’ నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగచైతన్య–సమంత విడాకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపిన నేపథ్యంలో, అక్కినేని కుటుంబం ప్రతిష్ఠ దెబ్బతిందన్న కారణంతో నాగార్జున గతంలో కోర్టును ఆశ్రయించారు. అయితే మంత్రి సురేఖ బహిరంగంగా క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ముగిసింది.

2024 అక్టోబర్ 2న లంగర్ హౌస్‌లో మాట్లాడినప్పుడు, చైతూ–సమంత విడాకులకు కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన నాగార్జున, BNS సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు.

కోర్టు ఈరోజు విచారణ చేపట్టగా, మంత్రి సురేఖ ఇప్పటికే రెండుసార్లు సోషల్ మీడియాలో అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పిన సంగతి నమోదు చేశారు. అదనంగా కోర్టు ముందు కూడా తన వ్యాఖ్యలు అనుచితమని అంగీకరించి క్షమాపణ చెప్పడంతో నాగార్జున కేసును విత్‌డ్రా చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ నిర్ణయంతో గత కొద్దికాలంగా చెరువులా ముదిరిన వివాదం పరిష్కారమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.