manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 7:36 am Editor : manabharath

పెట్టుబడిదారులకు పూర్తి భరోసా: సీఎం చంద్రబాబు

🚀 కంపెనీల అనుమతుల్లో జాప్యం ఉండదు – పెట్టుబడిదారులకు పూర్తి భరోసా: సీఎం చంద్రబాబు

ఇండియా-యూరప్ బిజినెస్ మీట్‌లో ముఖ్యమంత్రి స్పష్టం

మన భారత్‌, విశాఖపట్నం, నవంబర్‌ 12:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ఇకపై అనుమతుల విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖలో జరిగిన ఇండియా-యూరప్ బిజినెస్ మీట్ లో  పాల్గొన్న ఆయన, పారిశ్రామిక వేత్తలకు సురక్షితమైన మరియు వేగవంతమైన వ్యాపార వాతావరణం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో అగ్రగామిగా నిలవాలని మన లక్ష్యం. అందుకోసం అన్ని విభాగాల అనుమతులను డిజిటల్‌గా, సింగిల్ విండో ద్వారా వేగంగా ఇవ్వడానికి చర్యలు చేపట్టాం,” అని సీఎం చంద్రబాబు వివరించారు.

అలాగే, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను హబ్‌గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. “త్వరలో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ప్రారంభం కానున్నాయి. ఇది రాష్ట్రానికి కొత్త పారిశ్రామిక దశను తెస్తుంది,” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం పెట్టుబడిదారుల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు పారదర్శక పాలన, శీఘ్ర అనుమతులు, మౌలిక సదుపాయాల విస్తరణ పై దృష్టి పెట్టిందని అన్నారు.