manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 November 2025, 3:43 am Editor : manabharath

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఢిల్లీలో ఇండో–యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్
తరువాత కాంగ్రెస్‌ పెద్దలతో కీలక సమావేశం – రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించే అవకాశం

మన భారత్‌, న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో జరుగుతున్న ఇండో–యూఎస్ సమ్మిట్‌ ప్రతినిధి బృందంతో భేటీ కానున్నారు. ఇరుదేశాల మధ్య వ్యాపార, సాంకేతిక, విద్యా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశం సాగనుంది. ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు, ఐటీ, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, హెల్త్‌ సెక్టార్‌ రంగాల్లో సంయుక్త ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉందని సమాచారం.

సమావేశం అనంతరం సీఎం రేవంత్ ఢిల్లీలోనే పార్టీ ప్రధాన నేతలతో కూడా ముఖాముఖి చర్చలు జరపనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే ప్రభుత్వ పథకాల అమలు పై సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణలో పెట్టుబడులు పెంచేందుకు అమెరికా సంస్థలు చూపుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ భేటీ కీలకంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రేవంత్‌తోపాటు ముఖ్య అధికారుల బృందం కూడా సమావేశంలో పాల్గొననుంది.