ఢిల్లీ పేలుడు.. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
గాయపడిన వారికి మెరుగైన వైద్యం.. శాంతిభద్రతల బలోపేతంపై సీఎం దృష్టి మన భారత్,న్యూఢిల్లీ, నవంబర్ 11:ఢిల్లీలో జరిగిన భయానక పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, శాశ్వత వికలాంగులైన వారికి రూ.5 లక్షల పరిహారం అందజేస్తామని తెలిపారు. సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ.. “మరణించిన వారి కుటుంబాలకు ఇది భర్తీ...