రేపే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ – స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటించిన కలెక్టర్
నవంబర్ 14న కౌంటింగ్ రోజు కూడా సెలవు
మన భారత్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ రేపు జరగనున్న నేపథ్యంలో, ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్యాలయాలు, ఐటీ కంపెనీలకు సెలవు ప్రకటించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఉపఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, మరియు ప్రభుత్వ యంత్రాంగం సజావుగా పనిచేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పోలింగ్ నిర్వహణలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా అధికారులు తెలిపారు.
అలాగే ఈ నెల 14న కౌంటింగ్ జరిగే ప్రాంతంలో కూడా సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని పోలీసులు సూచించారు.
ప్రజలు స్వేచ్ఛగా, శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు కోరారు.