దాజి శంకర్ కృషి మారువలేనిది – సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాంతం పోరాడిన నేతకు ఘన నివాళి
మన భారత్, తాంసీ, నవంబర్ 10: ప్రజా సమస్యల పరిష్కారానికి జీవితాన్ని అర్పించిన నాయకుడు కామ్రేడ్ దాజీ శంకర్ కృషి మారువలేనిదని సీపీఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన 39వ వర్ధంతి సందర్భంగా తాంసీ మండలంలోని ఈదుల్లా సవర్గాం గ్రామంలో ఉన్న దాజీ శంకర్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దాజీ శంకర్ ప్రజా ఉద్యమాలకు ప్రేరణనిచ్చిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రజల హక్కుల కోసం నిస్వార్థంగా శ్రమించిన దాజీ శంకర్ తెలంగాణ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో AITUC కార్యదర్శి విలాస్, CPI నాయకులు దేవిదాస్, నళిని, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం దాజీ శంకర్ సేవలను స్మరించుకుంటూ నాయకులు ప్రజా సమస్యలపై అవగాహన చర్చలు జరిపారు.