మన భారత్, తలమడుగు, నవంబర్ 7: మండలంలోని కేజీబీవీ లింగి పాఠశాలను ఎస్సైరాధిక గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన కల్పించారు. అలాగే కెరీర్ గైడెన్స్, పోక్సో చట్టం (POCSO Act), గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “నేటి యుగంలో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేయకూడదు, వ్యక్తిగత సమాచారం పెంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి” అని వెల్లడించారు. చిన్నారుల భద్రత, హక్కులు, నేరాల నివారణలో చట్టపరమైన రక్షణపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు మంచి స్పృహ కలిగించే గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాన్ని ప్రదర్శనాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.