దళిత బంధు పేరుతో మోసం.. వ్యక్తిపై కేసు నమోదు
మన భారత్, ఇచ్చోడ, నవంబర్ 6: దళిత బంధు పథకం పేరుతో మోసం చేసిన ఘటన ఇచ్చోడ మండలంలో వెలుగులోకి వచ్చింది. తలమాద్రి గ్రామానికి చెందిన అక్కనపల్లి సుమన్ నుంచి దళిత బంధు పథకం ఇప్పిస్తానని చెప్పి దాసరి భాస్కర్ అనే వ్యక్తి రూ.2.50 లక్షలు తీసుకున్నాడు. అయితే పథకం మంజూరు కాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో బాధితుడు సహా ముగ్గురు వ్యక్తులు ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భాస్కర్‌పై మోసం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇచ్చోడ సీఐ బండారి రాజు మీడియాతో వెల్లడించారు.
సీఐ మాట్లాడుతూ, “దళిత బంధు లేదా ఇతర ప్రభుత్వ పథకాల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
ప్రభుత్వ పథకాల కోసం ఎటువంటి మధ్యవర్తులు అవసరం లేదు అని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.