manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 11:33 pm Editor : manabharath

కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ర్యాలీ..

వామన్ నగర్‌లో ఎన్ఎస్ఎస్ అవగాహన ర్యాలీ – మూఢనమ్మకాలపై, బాల్యవివాహాలపై ప్రజల్లో చైతన్యం

మన భారత్, ఆదిలాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల తాంసి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరంలో భాగంగా మూడవ రోజు కార్యక్రమం వామన్ నగర్ గ్రామంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి వాలంటీర్లు గ్రామస్తుల మధ్య అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో మూఢనమ్మకాల నిర్మూలన, బాల్యవివాహాల నిరోధం, సామాజిక రుగ్మతల నివారణ, పరిశుభ్రత, పచ్చదనం, మానసిక మరియు శారీరక ఆరోగ్యం వంటి ముఖ్య అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు. వాలంటీర్లు బోర్డులు, నినాదాలతో గ్రామం అంతా తిరిగి ప్రజలకు సందేశాలు అందించారు.

ఈ అవగాహన ర్యాలీలో కళాశాల లెక్చరర్లు K. శశి కుమార్, T. దేవేందర్**, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ N. సంతోష్, వాలంటీర్లు పాల్గొన్నారు.

ఎన్ఎస్ఎస్ శిబిరం నవంబర్ 1 నుండి 7 వరకు కొనసాగనుంది. విద్యార్థుల్లో సేవా భావం, సామాజిక బాధ్యత పెంపొందించడమే ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.