manabharath.com
Newspaper Banner
Date of Publish : 03 November 2025, 11:21 pm Editor : manabharath

కళాశాలలో ఇంటర్ బోర్డ్ అధికారి తనిఖీ..

తరగతులకు విధిగా హాజరు కావాలన్న ఇంటర్ బోర్డు అధికారి

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 3: ఇంటర్ విద్యార్థులు తరగతులకు క్రమంగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారి వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా కళాశాల పరిపాలనా విధానాలు, విద్యార్థుల FRS (Face Recognition System) హాజరు రికార్డులు, మరియు అధ్యాపకుల తరగతి బోధన విధానాలను సమీక్షించారు. విద్యార్థుల హాజరుపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రిన్సిపాల్ సుదర్శన్‌కు సూచించారు.

విద్యార్థుల తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించి వారి పిల్లల చదువు ప్రగతిని పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో AGMC ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల హాజరుతోనే విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని, సమయానికి తరగతులకు హాజరు కావడం ద్వారా భవిష్యత్తు విజయానికి పునాది పడుతుందని వెంకటేశ్వర్ పేర్కొన్నారు.